ఆదివారంతో ‘గురు’ స్టామినా ఏమిటో తెలిసిపోయింది !


విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేసిన ‘గురు’ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. విడుదలకు ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోల ద్వారా చిత్రాన్ని ప్రదర్శించడంతో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి రోజు ఏపి, తెలంగాణల్లో రూ. 2.43 కోట్ల షేర్ వసూలవగా ఆ మొత్తం ఆదివారం నాటికి రెట్టింపుకన్నా ఎక్కువైంది.

విడుదలకు ముందే మంచి బజ్ ఉండటం, విడుదలయ్యాక కథ కథనాలు, వెంకటేష్, రితికా సింగ్ ల నటన, దర్శకత్వం అన్నీ అంశాలు బాగుండటంతో పాజిటివ్ టాక్ భారీ ఎత్తున వ్యాపించి ఆదివారం నాడు ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిశాయి. అంతేగాక థియేటర్ల సంఖ్య కూడా పెంచడంతో వసూళ్లు మరింత పుంజుకున్నాయి. దాదాపు అన్ని స్క్రీన్లు హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడవడంతో 3వ రోజైన ఆదివారం నాడు సుమారు రూ. 6. 5 కోట్ల షేర్ వసూలైంది. ఈ ఒక్క రోజుతో బాక్సాఫీస్ వద్ద ‘గురు’ స్టామినా ఏమిటో రుజువై సినిమా మంచి విజయంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టడం ఖాయమని అర్థమైపోయింది.