బాహుబలి పుణ్యమా అని రాజమౌళి పేరు ఆంధ్రా, తెలంగాణాలను దాటి భారతదేశమంతా వ్యాప్తి చెందింది. ఎంతోమంది సినీ ప్రముఖులు, బడా టెక్నీషియన్లు ఈ సినిమాలో తాము కూడా ఒక భాగమైనందుకు సంతోషపడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ హక్కులను జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ ద్వారా విడుదల చేసేందుకు భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకున్నారు. తమిళనాట స్టూడియో గ్రీన్ అత్యంత ప్రజాదరణ పొందిన నిర్మాణ సంస్థ.
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


