‘శ్రీమంతుడు’లో అదిరిపోయే ఇంటర్వల్ బ్లాక్

‘శ్రీమంతుడు’లో అదిరిపోయే ఇంటర్వల్ బ్లాక్

Published on Jul 14, 2015 8:10 PM IST

Mahesh-srimantudu
డైరెక్టర్ గా మొదటి సినిమా ‘మిర్చి’తో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న డైరెక్టర్ కొరటాల శివ. కథా పరంగా అక్కడక్కడా రెగ్యులర్ అనిపించినా చాలా ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో, మాస్ మెచ్చే కొన్ని సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మిర్చి సినిమాని సూపర్ హిట్ చేసాడు. కొరటాల శివ తన ద్వితీయ ప్రయత్నంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ సినిమా చేసాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీమంతుడు సినిమాలోని ఓ ఆసక్తికర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. శ్రీమంతుడు సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని, అలాగే సినిమాలో ఓ మేజర్ హైలైట్ అవుతుందని సమాచారం. కొరటాల శివ మహేష్ బాబు ఇమేజ్ కి సరిపోయేలా పర్ఫెక్ట్ గా డిమాండ్ చేసాడని అంటున్నారు. మిర్చి సినిమాలో కూడా ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ‘శ్రీమంతుడు’ లోని ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం.

ఈ యాక్షన్ ఎపిసోడ్ ని మహేష్ బాబు – హరీష్ లపై షూట్ చేసారు. మరి అది ఎలా ఉంటుంది అనేది చూడాలి అంటే ఆగష్టు 7 వరకూ వేచి చూడాల్సిందే. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో లాంచ్ జూలై 18న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనుంది. మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు