స్టార్ హీరో మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన స్టంట్ మాస్టర్

Published on Aug 8, 2020 1:23 am IST


తలపతి విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్టర్. భారీ యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీకి స్టంట్ మాస్టర్ గా చేసిన సిల్వా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మాస్టర్ మూవీలో ఐదు లేదా ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. అలాగే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ చాలా సహజంగా ఉంటుందట. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అడిగి మరీ యాక్షన్ ఎపిసోడ్స్ రియలిస్టిక్ గా ఉండేలా కంపోజ్ చేయించారని సెల్వా చెప్పుకొచ్చారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో విజయ్ లెక్చరర్ గా మాఫియా డాన్ గా రెండు పాత్రలలో కనిపించనున్నారు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆండ్రియా కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. యంగ్ సెన్సెషన్ అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. జేవియర్ బ్రిట్టో నిర్మిస్తునారు.

సంబంధిత సమాచారం :

More