ఇంట్రడక్షన్ సాంగ్ స్టార్ట్ చేసిన మహేష్, శృతి..

ఇంట్రడక్షన్ సాంగ్ స్టార్ట్ చేసిన మహేష్, శృతి..

Published on Dec 10, 2014 1:10 PM IST

Mahesh-Babu-Koratala-Shiva

సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా తాజా షెడ్యూల్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. హీరో పరిచయ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. తర్వాత సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. శృతి హాసన్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. గత నెలలో పూణేలో ఒక షెడ్యూల్ లో పూర్తయింది. ఇది రెండవ షెడ్యూల్.

రాజేంద్రప్రసాద్‌, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు