‘బన్నీ – త్రివిక్రమ్’ సినిమా విడుదల ఎప్పుడంటే !

Published on Jul 10, 2019 4:43 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల్లు అర్జున్ 19వ’ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో చిత్రబృందం అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమా డిసెంబర్ లో వస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం సంక్రాంతికే తమ సినిమా విడుదల అని స్పష్టం చేసింది. అయితే తేదీ మాత్రం ప్రకటించలేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 11న గాని లేదా జనవరి 13న గాని సినిమా విడుదల ఉంటుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో బన్నీతో పాటు సినిమాలోని మిగిలిన స్టార్ కాస్టింగ్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More