విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గీత గోవిందం. ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా రానున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈనెల 29న జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరుగనుంది. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన ఈచిత్రంలోని ‘ఇంకేంఇంకేం’ అనే సాంగ్ 2కోట్ల డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ , రష్మిక ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. టీజర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది.
