ఈ ఫ్రైడే తెలుగుయు ఆడియెన్స్ ని అలరించేందు వచ్చేసిన ఎంటర్టైనర్స్ లో సమంత నిర్మాతగా అలాగే చిన్న క్యామియో రోల్ లో కూడా నటించిన లేటెస్ట్ చిత్రం శుభం అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు శ్రీవిష్ణు అలాగే కేతిక శర్మ, ఇవానా నటించిన సింగిల్ చిత్రాలు కూడా ఒకటి. మరి ఈ రెండు చిత్రాలు కూడా ప్రీమియర్స్ సహా డే 1 మొదటి షో నుంచే మంచి టాక్ ని అందుకోగా ఫైనల్ గా ఈ చిత్రాలు మంచి ఎంటర్టైనర్స్ గా నిలిచాయి.
ఇక ఈ చిత్రాలకి తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఇలా శుభం చిత్రం 75 వేలకి పైగా డాలర్స్ గ్రాస్ తో శుభారంభం అందుకుంటే సింగిల్ చిత్రం లక్ష 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. మొత్తానికి మాత్రం ఈ రెండు చిత్రాలకి యూఎస్ లో మంచి స్టార్ట్ దక్కింది అని చెప్పాలి. ఇక వీకెండ్ కి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి మరి.