స్టార్ బ్యూటీ సమంత నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నమే ‘శుభం’ చిత్రం. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ హార్రర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం సక్సెస్ అయ్యింది. మే 9న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికీ ఈ మూవీకి అక్కడ మంచి వసూళ్లు వస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 250K డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ మూవీ 250K డాలర్స్ మార్క్‌ను టచ్ చేసింది.
ఈ సినిమాను ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ప్రొడ్యూస్ చేసింది. ఇక ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలినీ కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లను రాబడుతుందో చూడాలి.



