బాలయ్యతో క్రేజీ డైరెక్టర్.. యాక్షన్ తో పాటు ఫన్ కూడా !

Published on May 3, 2021 8:30 am IST

డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఫలానా హీరో సినిమా అంటూ గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వరుస సక్సెస్ ల వల్ల మొత్తానికి అనిల్ రావిపూడి అందరికీ హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. కాగా తాజా రూమర్ ప్రకారం వచ్చే ఏడాదిలో బాలయ్య బాబు – అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా రానుందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కథ విషయమై సంప్రదింపులు కూడా జరిపారట. అఖండ చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా సెట్ చేసుకుంటున్నాడు.

అందులో భాగంగానే గతంలో తనకు అనిల్ చెప్పిన కథ బాగా నచ్చి బాలయ్య అతనితో పనిచేయడానికి ఆసక్తి చూపించాడట. ఇలా క్రేజీ కలయికలో మొత్తానికి త్వరలోనే ఫుల్ యాక్షన్ తో పాటు ఫన్ తో సాగే సినిమా రాబోతుంది అన్నమాట. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :