డైరెక్టర్ గా మారనున్న సక్సెస్ఫుల్ నిర్మాత.?

డైరెక్టర్ గా మారనున్న సక్సెస్ఫుల్ నిర్మాత.?

Published on Apr 29, 2015 12:01 AM IST

Ram-mohan
చిన్న సినిమాలు గా వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలు ‘అష్టా – చమ్మా’, ‘ఉయ్యాలా జంపాలా’. ఈ సినిమాలతో నిర్మాతగా పరిచయం అయిన నిర్మాత రామ్ మోహన్. ఈ యన ప్రస్తుతం నాగార్జున హీరోగా రానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని నిర్మిస్తున్నాడు. స్వతహాగా ఈయన నిర్మాత అయినప్పటికీ రైటింగ్ మీద ఉన్న ఆసక్తి వలన ఉయ్యాలా జంపాలా సినిమాకి స్క్రీన్ ప్లే పరంగా హెల్ప్ అచేసాడు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి కూడా కథ – స్క్రీన్ ప్లే ని రామ్ మోహన్ అందించాడు.

ఇప్పటి వరకూ నిర్మాతగా, రైటర్ గానే ఉన్న ఈ రామ్ మోహన్ ఇప్పుడు దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. అందుకోసం ఇప్పటికే కథ మరియు నటీనటుల్ని సెలక్ట్ చేసాడు. రామ్ మోహన్ తన మొదటి సినిమా కోసం ఉయ్యాలా జంపాలా పేం అవిక గోర్ ని సెలక్ట్ చేస్తే, హీరోగా గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక క్రికెటర్ గా కనిపించిన సంతోష్ శోభన్ ని హీరోగా ఎంపిక చేసాడు. నాగార్జునతో చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయనా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మరి ఇప్పటి వరకూ నిర్మాతగా సక్సెస్ అయిన రామ్ మోహన్ డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

తాజా వార్తలు