సక్సెస్ ఫుల్ గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైంది !

Published on Apr 10, 2021 11:59 pm IST

తెలుగు హీరోయిన్ అంజలి లేటెస్ట్ గా వకీల్ సాబ్ తో మంచి హిట్ కొట్టింది. అప్పుడెప్పుడో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తరువాత, మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ను చూసింది వకీల్ సాబ్ తోనే. అందుకే వకీల్ సాబ్ సినిమా ఆమె కెరీర్ లో ప్రత్యేమైన సినిమా అని.. ఈ సినిమాతో తన సక్సెస్ ఫుల్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని అంజలి ఫీల్ అవుతుందట.

కాగా తెలుగులో అంజలికి వరుస పరాజయాలు క్యూ కట్టడంతో.. ఆమెకు ఆశించిన స్థాయిలో ఆ తరువాత అవకాశాలు రాలేదు. సీనియర్ హీరోల సినిమాల్లో నటించినా… ఆ సినిమాలు అంజలికి కలిసిరాలేదు. అయితే అనూహ్యంగా ఆమెకు వకీల్ సాబ్ సినిమా రావడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అంజలి కెరీర్ మళ్ళీ సక్సెస్ బాట పట్టింది. మరి ఇక నుండైన అంజలికి వరుస సినిమాలు వస్తయోమో చూడాలి.

సంబంధిత సమాచారం :