రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలోని లిరిక్స్ గురించి కీరవాణిగారు తాజాగా ట్వీట్ చేశారు. రచయిత సుద్దాల అశోక్ తేజగారు ‘ఆర్ఆర్ఆర్’ కోసం సాంగ్ రాయడం మొదలుపెట్టారని ఆయన పోస్ట్ పెట్టారు. అశోక్ తేజగారు ఫాస్ట్ గా రాసిన పాట చాలా అద్భుతంగా చాలా బ్రిలియంట్ గా ఉందని కీరవాణి పోస్ట్ చేశారు.
ఇక రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన వివరాలను వెల్లడించడానికి ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ హోటల్ లో మార్చి 14వ తేదీన ఈ ప్రెస్ మీట్ ను నిర్వహించాలనుకుంటున్న విషయం తెలిసిందే.
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Suddala Ashokteja garu started writing lyrics for RRR . He is amazingly fast and at the same time brilliant ?
— mmkeeravaani (@mmkeeravaani) March 13, 2019