సల్మాన్ కి విలన్ గా పహిల్వాన్…!

Published on Oct 8, 2019 12:24 pm IST

కిచ్చా సుదీప్ కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇతర పరిశ్రమల స్టార్ హీరోల సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి మూవీలో అవుకు రాజు పాత్రలో ఆయన నటించి మెప్పించారు. గతంలో కూడా రాజమౌళి నాని కాంబినేషన్ లో వచ్చిన ఈగ మూవీలో విలన్ రోల్ చేసిన సుదీప్, బాహుబలి మూవీలో గెస్ట్ రోల్ చేయడం జరిగింది. తాజాగా పహిల్వాన్ పేరుతో మల్టీ లింగ్వల్ మూవీ విడుదల చేసిన సుదీప్ మరో మారు విలన్ పాత్ర చేస్తున్నారు అని సమాచారం.

సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్న దబాంగ్ 3 చిత్రంలో సుదీప్ విలన్ రోల్ చేస్తున్నాడు. నేడు సల్మాన్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ ధృవీకరించడంతో పాటు, విలన్ గా సుదీప్ లుక్ ని రివీల్ చేశారు. “బలవంతుడైన విలన్ ని పడగొట్టినప్పుడు వచ్చే మజానే వేరు….దబాంగ్ 3లో బల్లి అనే పాత్ర చేస్తున్న సుదీప్ ని పరిచయం చేస్తున్నాం” అని ఆయన ట్వీట్ చేశారు. దీనితో దబాంగ్ 3 మూవీలో సుదీప్ బల్లి అను పేరుగల ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ మూవీలో మరో మారు సోనాక్షి సల్మాన్ సరసన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More