ఇంటర్వ్యూ : సుధాకర్ కొమాకుల – ప్రేక్షకులు ‘నువ్వు తోపురా’ అనాలనే ఈ టైటిల్ పెట్టాం !

Published on May 1, 2019 5:32 pm IST

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల నటించిన తాజా చిత్రం నువ్వు తోపురా. మే 3న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. గీతా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని విడుదలచేయనుంది. హరినాథ్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యునైటెడ్ ఫిలిమ్స్ బ్యానేర్ ఫై డి శ్రీకాంత్ నిర్మించారు. ఈ కాగా ఈ సందర్భంగా హీరో సుధాకర్ కొమాకుల మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఈ చిత్రంలో సూర్య అనే పాత్ర చేస్తున్నాను. అంటే అసలు బాధ్యతలు లేకుండా తిరిగే ఒక కుర్రాడు అమెరికా వెళ్లి.. అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరికి అందరి చేత ‘నువ్వు తోపురా’ అని ఎలా అనిపించుకున్నాడు అనేదే సినిమా.

అంటే సినిమా ఎక్కువుగా అమెరికాలో సాగుతుందా ?

కీలక సన్నివేశాలన్నీ అమెరికాలో ఉంటాయండి. సినిమాలో అన్ని భావోద్వేగాలు కలగలిపి వినూత్నంగా ఉంటుంది సినిమా. ఖఛ్చితంగా యువతరం తమని తాము హీరో పాత్రలో చూసుకుంటారు. ఈ చిత్రం నేను మరో మెట్టు పైకి ఎదిగేలా చేస్తుందని నమ్ముతున్నాను.

ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పండి ?

ఈ సినిమాకు డైరెక్టర్ హరినాథ్ బాబు అండి. ఆయన నాకు ఈ సినిమాకు ముందు నుంచే తెలుసు. మంచి ఫ్యాషన్ తో ఈ సినిమా చేశారు. మా రైటర్ అంజూ కూడా సినిమా కోసం బాగా కష్టపడ్డారు.

ప్రోమోస్ చూస్తుంటే.. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లున్నారు. ఈ చిత్ర నిర్మాతలు గురించి చెప్పండి ?

నిజంగా మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా వాళ్లకు మొదటి సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో కథానుసారంగా ఉత్తమ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఇండస్ట్రీలో వాళ్లకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం.

సినిమా టైటిల్ బాగా మాస్ లా అనిపిస్తోంది ?

చాలా టైటిల్స్ అనుకున్నాం. ఫైనల్ గా ఈ టైటిల్ ఫిక్స్ అయింది. అయితే టైటిల్ మాత్రం కావాలని పెట్టలేదు. కథకు అనుగుణంగా పెట్టిందే. సినిమా చూసాక టైటిల్ కరెక్ట్ గా పెట్టామని మీరే అంటారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిత్య శెట్టి గురించి చెప్పండి ?

నిత్య శెట్టి మన తెలుగు అమ్మాయే. దేవుళ్ళు సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ గా చేసింది. తను చాలా బాగా చేసింది. డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది. సినిమాలో తనక్కూడా మంచి పేరు వస్తోంది.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

ఈ సినిమా రిలీజ్ అయ్యాక గాని తరువాత సినిమాలు గురించి ఆలోచిస్తాను. ఇప్పటివరకూ అయితే ఏ సినిమా అంగీకరించకలేదు.

సంబంధిత సమాచారం :

X
More