తన రెండో లుక్ పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Mar 2, 2023 10:07 pm IST


మన టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ డెడికేటివ్ హీరో అయినటువంటి నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా ఒకరు. మరి ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “మామా మశ్చీంద్ర” కోసం తెలిసిందే. రచయితా నటుడు హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు ఇంట్రెస్టింగ్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అలాగే వీటిలో మొదటగా దుర్గ అనే రోల్ లుక్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఈ రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేసిన సుధీర్ బాబు ఇక నెక్స్ట్ వచ్చే లుక్ కోసం సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. దుర్గ కి ఇచ్చిన రెస్పాన్స్ ని చాలా థాంక్స్ అని అలాగే నెక్స్ట్ వచ్చే పరశురామ్ గాడి స్వాగ్ కూడా అదిరిపోతుంది అని తాను చెప్తున్నాడు. ఇక ఈ లుక్ అయితే ఈ మార్చ్ 4 న రాబోతుంది. మరి ఇందులో తాను ఎలా కనిపించి ఆశ్చర్యపరుస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఈషా రెబ్బా, మిర్నాలని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :