మహేష్ బాబు బాటలో సుధీర్ బాబు

Published on Jun 2, 2021 11:09 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో చిన్న పిల్లలకు హార్ట్ ఆరేషన్స్ కూడ ఒకటి. ఆంధ్రా హాస్పిటల్స్ వారితో కలిసి మహేష్ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా మొదట చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అవసరం అయితే మహేష్ సొంత ఖర్చులతో సర్జరీలు చేస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ వెయ్యి మందికి పైగా పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించారు. ఇప్పుడు ఆయన బంధువు, హీరో సుధీర్ బాబు సైతం అదే బాటలో నడుస్తున్నారు.

ఇటీవల సుధీర్ బాబు సంస్కృతి అనే చిన్న పాపకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయించారు. సర్జరీ విజయవంతమై పాప ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంది. సుధీర్ బాబు సంస్కృతి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మరీ పాప ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ పాప చదువు కోసం, భవిష్యత్తులో ఆరోగ్య అవసరాల కోసం కొంత డబ్బును పాప అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని మాట కూడ ఇచ్చారు. సుధీర్ బాబు చేసిన ఈ మంచి పనిని సోషల్ మీడియా జనం మెచ్చుకుంటున్నారు. ఇకపోతే సుధీర్ బాబు ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లాంటి సినిమాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :