‘సమ్మోహనం’తో సాలిడ్ హిట్ అందుకున్న సుధీర్ బాబు !
Published on Jun 21, 2018 3:52 am IST

‘ఎస్ఎమ్ఎస్’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచియమైన నటుడు సుధీర్ బాబు ఈ సినిమా ఆయనకు విజయాన్ని అందివ్వలేకపోయింది . ఇక ఈ చిత్రం తరువాత మారుతీ దర్శకత్వంలో ‘ప్రేమకథాచిత్రం’ సినిమాలో నటించాడు . ఈ సినిమా మంచి విజయాన్నే సాధించిన సుధీర్ బాబు కి మాత్రం పేరును తీసుకరాలేదు . ఈ సినిమా తరువాత నటించిన సినిమాలు వరుసగా పరాజయాన్ని సాధించాయి 2015లో భలే మంచి రోజు చిత్రం తో మళ్ళి విజయాన్ని అందుకున్నారు .

ఇక ఈ చిత్రం తరువాత కూడా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ సుధీర్ బాబు కి ఎట్టకేలకు ‘సమ్మోహనం’మంచి విజయాన్ని అందించింది .ఇటీవల విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ తోపాటు సుధీర్ బాబుకి నటన పరంగా మంచి పేరును కూడా తీసుకొచ్చింది . మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ సుధీర్ బాబు కెరిర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకుంటుంది .రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన అదితి రావ్ హైదరి నటించారు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook