ఫ్రెష్ గా అనిపిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్.!

Published on May 11, 2021 10:03 am IST

ఈరోజు మన టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా ఇతర సినీ తారలు విషెష్ తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్” నుంచి మేకర్స్ ఆసక్తికర గ్లింప్స్ కట్ ను రిలీజర్ చేశారు. ఇది ఒకింత ఆసక్తిగాను మరియు ఇంటెన్స్ గా ఉందని చెప్పాలి.

హిట్ చిత్రం “పలాస” దర్శకుడు కరుణ కుమార్ అందులో చూపిన టేకింగ్ ఇందులో కూడా మిస్ కాకుండా మంచి నేటివిటీలో చూపిస్తున్నట్టు అర్ధం అవుతుంది. అలాగే లైటింగ్ సూరిబాబు అనే రోల్ లో సుధీర్ బాబు కొత్తగా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూనే మరోపక్క మ్యాచో బాడీతో కూడా ఆశ్చర్యపరిచాడు.

అలాగే ఈ గ్లింప్స్ స్టార్టింగ్ లో కనిపించిన గ్రేట్ విజువల్స్ కూడా బాగున్నాయి. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఓవరాల్ గా మాత్రం ఈ గ్లింప్స్ మంచి ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు అతి త్వరలనే విడుదల చెయ్యనున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :