సిక్స్ ప్యాక్ సీక్రెట్ చెప్పిన హీరో !

Published on May 16, 2021 12:00 am IST

హీరో సుధీర్ ‌బాబు తాజాగా నటిస్తోన్న కొత్త సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్‌ గ్లింప్స్‌ కి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఫస్ట్‌ గ్లింప్స్‌ లో ఎక్కువగా హైలైట్ గా నిలిచింది మాత్రం, సుధీర్ బాబు సిక్స్‌ ప్యాక్‌ బాడీనే. కాగా సుధీర్ బాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సిక్స్‌ ప్యాక్‌ గురించి దాని వెనకున్న సీక్రెట్స్‌ ఏమిటి అనే విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

‘నేను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. అలాగే తీసుకునే ఫుడ్ టైమింగ్ తో పాటు మంచి డైట్‌ తీసుకుంటాను. మంచి డైట్‌ తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. నేనూ అదే చేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రానున్న సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. పైగా ఈ సినిమాలో ఉప్పెన భామ కృతిశెట్టి, సుధీర్‌ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :