నెవర్ బిఫోర్ అవతార్ తో సుదీర్ బాబు కొత్త సినిమా అనౌన్సమెంట్!

నెవర్ బిఫోర్ అవతార్ తో సుదీర్ బాబు కొత్త సినిమా అనౌన్సమెంట్!

Published on Oct 27, 2022 11:27 AM IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో మోస్ట్ డెడికేటివ్ యంగ్ హీరో నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా ఒకరు. మరి సుధీర్ బాబు హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు తాను చేస్తుండగా ఇప్పుడు తన కెరీర్ లో 18వ సినిమాని అయితే మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. దర్శకుడు జ్ఞ్యాన సాగర్ ద్వార తెరకెక్కించనున్న ఈ చిత్రంలో అయితే సుధీర్ బాబు మంచి నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఇక ఈ అక్టోబర్ 31 నుంచి అయితే మాస్ సంభవం అంటూ మరో ఇంట్రెస్టింగ్ అంశం రివీల్ చేశారు. మరి ఈ అనౌన్సమెంట్ పై రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఒక పోస్ట్ కార్డు పై కొన్ని డీటెయిల్స్ పక్కన గన్స్ పాత కాలపు నోటు ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రం ఒక పీరియాడిక్ డ్రామాలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంకి సుమంత్ జి నాయుడు నిర్మాణం వహిస్తుండగా మరిన్ని అప్డేట్ మున్ముందు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు