ఆది సాయి కుమార్ “బ్లాక్” చిత్రం టీజర్ ను లాంఛ్ చేయనున్న సుధీర్ బాబు!

Published on Aug 6, 2021 8:40 pm IST


ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉంటున్నారు. అయితే మరొక చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యారు ఆది. బ్లాక్ అంటూ మరొక చిత్రం లో హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీ. బీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల కి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో సుధీర్ బాబు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది.

సంబంధిత సమాచారం :