ఫైట్ తో స్టార్ట్ చేయనున్న ‘శాకినీ- ఢాకినీ’ !

Published on Jun 21, 2021 8:09 pm IST

రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రానున్న చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమా షూటింగ్ జులై 4 నుండి ఒక ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయనున్నారు. రెజీనా, నివేదా థామస్‌ మధ్య వచ్చే ఈ ఫైట్, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వస్తోందట. సినిమా మొత్తానికే ఈ ఫైట్ హైలైట్ గా నిలుస్తోందట.

కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను రీమేక్ గా చేస్తోన్న సినిమా ఇది. అయితే, ‘రణరంగం’ ఆశించిన స్థాయిలో ఆడక పోయే సరికి సుధీర్ వర్మకు ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో ఇద్దరు నాయికల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా టైంకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర తమ పాత్రల కోసం కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట.

సంబంధిత సమాచారం :