నాని మూవీలో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చిన సుధీర్

Published on Jul 20, 2019 9:00 am IST

విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వి”. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. నివేదా థామస్,అదితిరావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు, ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా హీరో సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. ఆయన భవిష్యత్ చిత్రాలు,వాటిలో పాత్రల గురించి హింట్స్ ఇచ్చారు .”వి” చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ పాత్ర చేయనున్నారట. ఇప్పటికే హీరో నాని “వి” చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉండే సీరియల్ కిల్లర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో సుధీర్ పోలీస్ పాత్రపై ఆసక్తి నెలకొంది. కాబట్టి కిల్లర్ నానిని వెంటాడే పోలీస్ గా సుధీర్ పాత్ర ఉండబోతుందని అర్థం అవుతుంది. అలాగే సుధీర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపి చంద్ బయో పిక్ లో కూడా చేయనున్నారు.

సంబంధిత సమాచారం :