ఇంటర్వ్యూ :- సుధీర్ – మెగాస్టార్ నా సినిమా చూస్తామన్నారు.. ఈ జీవితానికి అది చాలు.

Published on Feb 6, 2020 3:24 pm IST

‘జబర్దస్త్‌’ షో ద్వారా పాపులర్‌ అయిన సుధీర్, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్‌’. జి. అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్‌ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సంధర్భంగా సుధీర్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

ఈ సినిమాకి చిరంజీవిగారి ఆశీర్వాదం కూడా లభించినట్లు ఉంది ?

అవును అండి. మెగాస్టార్ చిరంజీవిగారి ఈ రోజు సాయంత్రం తరువాత మా ‘త్రీ మంకీస్‌’ సినిమా చూస్తామన్నారు. నా జీవితానికి అది చాలు. స్వయంగా ఆయనే నా సినిమా చూస్తాననడం నాకు చాల గొప్ప విషయం. ఇక నా దృష్టిలో ఈ సినిమాకి హిట్ ప్లాప్ లు లేవు.

 

‘త్రీ మంకీస్‌’ సినిమా అసలు ఎలా మొదలైంది ?

మా డైరెక్టర్ జి. అనిల్‌ కుమార్‌ గారు మొదట కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఆయన అంత అద్భుతంగా కథను నెరేట్ చేశారు. విన్న వెంటనే మనం సినిమా చేస్తున్నాం అని ఫిక్స్ అయిపోయాను.

 

మరి డైరెక్టర్ జి. అనిల్‌ కుమార్‌ మీ అంచనాలను అందుకున్నాడా ?

అనిల్‌ కుమార్‌ గారు కథ ఎంత బాగా చెప్పారో సినిమాని కూడా అంతకన్నా బాగా తీశారు. పైగా ఈ సినిమాకి ఆయనే మ్యూజిక్ కూడా అందించారు. దాంతో ఏ సీన్ లో ఎలాంటి సౌండింగ్ ఉండాలి అనే విషయంలో కూడా ఆయన ఎంతో క్లారిటీగా ఈ సినిమాని తీశారు.

 

ఈ సినిమాకి ‘త్రీ మంకీస్‌’ అని టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు ?

టైటిల్ కథను బట్టి.. కథలోని మా పాత్రలను బట్టే పెట్టడం జరిగింది తప్ప.. ఎదో క్యాచీగా ఉందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ పెట్టలేదు.

 

ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?

మంచి కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. సరదాగా ఉండే మా క్యారెక్టర్స్ అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుని చివరికీ ఒక మంచి కోసం మేము ఏం చేశాం అనేదే ఈ సినిమా.

 

ఈ సినిమా రేపు విడుదల అవుతుంది. టెన్షన్ గా ఉందా ?

టెన్షన్ ఏమి లేదండి. నేను హీరోగా చేసిన నా ఫస్ట్ సినిమా ‘సాఫ్ట్ వేర్ సుదీర్’ విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే ఆ సినిమా అవుట్ ఫుట్ అంతగా బాగాలేకపోయినా.. నన్ను ఇష్టపడే ప్రేక్షకులు నా కోసం థియేటర్ కి వచ్చి మరి ఆ సినిమాని చూశారు. దాంతో నాకు నా సినిమాల పై నమ్మకం పెరిగింది. సినిమా బాగుంటే బాగా ఆదరిస్తారని.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

మెయిన్ లీడ్ గా ఒక సినిమా చేస్తున్నాను. అలాగే అఖిల్ గారి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :