సుడిగాలి సుధీర్ “గాలోడు” కి ఓటిటి డేట్ ఫిక్స్.!

Published on Feb 12, 2023 9:00 am IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర సాలిడ్ క్రేజ్ ఉన్నటువంటి కమెడియన్స్ లో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కోసం చెప్పక్కర్లేదు. తాను అక్కడ నుంచి సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎదిగి అక్కడ కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అలాగే తాను చేసిన లేటెస్ట్ మాస్ చిత్రం “గాలోడు”. దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అయితే ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ముఖ్యంగా సుధీర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్ గా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :