లేటెస్ట్ : మహేష్ ట్వీట్ పై సుహాస్ ఎమోషనల్ పోస్ట్

Published on Feb 6, 2023 9:33 pm IST

యువ నటుడు సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎంతో గ్రాండ్ గా రూపొందిన మూవీ రైటర్ పద్మభూషణ్. టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో గోపరాజు రమణ, రోహిణి, ఆశిష్ విద్యార్థి వంటి వారు కీలక పాత్రలు చేశారు. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ లవ్ యాక్షన్ ఎమోషనల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈ మూవీకి బాగా ఆదరణ లభిస్తోంది.

కాగా ఈ మూవీని ప్రత్యేకంగా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, నేడు ఆ మూవీ హీరో సుహాస్ తో పాటు నిర్మాతలు, దర్శకుడిని పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రైటర్ పద్మభూషణ్ టీమ్ కి ప్రత్యేక విషెస్ తెలియచేసారు మహేష్. అయితే మహేష్ బాబు ట్వీట్ పై కొద్దిసేపటి క్రితం స్పందించిన హీరో సుహాస్, ఎందుకు ఏడుస్తున్నావు అని టీమ్ అడిగితే, ఏమో వచ్చేస్తుంది, సూపర్ సైజు థాంక్యూ మహేష్ సర్ అంటూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు. మొత్తంగా మహేష్ బాబు కి పెద్ద అభిమాని అయిన సుహాస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :