సుకుమార్ కు వెయిటింగ్ తప్పేలా లేదుగా !

Published on Apr 25, 2019 8:23 am IST

గత ఏడాది రంగస్థలం వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి సినిమా మొదలుపెట్టడానికి మరో సంవత్సరం పట్టేలా వుంది. రంగస్థలం హిట్ కావడంతో మహేష్ బాబు తో సినిమా చేయాలనుకున్నాడు సుక్కు. మహేష్ కూడా ఓకే అన్నాడు. అయితే స్క్రిప్ట్ మహేష్ నచ్చకపోవడంతో సినిమాను క్యాన్సల్ చేశాడు.

ఇక ఆ తరువాత అల్లు అర్జున్ ను సినిమా కు ఒప్పించాడు. త్రివిక్రమ్ తో తరువాత సుకుమార్ సినిమా మొదలువుతుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా వేణు శ్రీరామ్ రేస్ లోకి వచ్చాడు. అల్లు అర్జున్ తన బర్త్ డే రోజు ఈరెండు సినిమాలతో పాటు ఐకాన్ అనే మూవీ చేయనున్నాని ప్రకటించాడు.

ఇక వేణు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉండడంతో బన్నీ, త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేసాక ఐకాన్ మూవీ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట. దాంతో సుకుమార్ కు ఎదురుచూపులు తప్పేలా కనబడడం లేదు.

సంబంధిత సమాచారం :