సుకుమార్ చేతుల మీదుగా ‘దూరదర్శిని’ నుంచి ‘అపనా తనామనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

సుకుమార్ చేతుల మీదుగా ‘దూరదర్శిని’ నుంచి ‘అపనా తనామనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

Published on Apr 19, 2025 12:00 AM IST

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ’దూరదర్శని’. కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు నానీడ వెళుతుందా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌కు కూడా అనూహ్యమైన ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అనే లిరికల్ వీడియోను పాన్‌ ఇండియా దర్శకుడు పుష్ప, పుష్ప-2 చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. సింధుజ, శ్రీనివాసన్‌ ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్‌కు సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు. ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా హీరో సువిక్షిత్‌ నా రూపం వచ్చేటట్లు వరిపొలంలో ఫామింగ్‌ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి సినిమా అంటే పాషన్‌. సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి’ అన్నారు.

హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. “ నా అభిమాన దర్శకుడు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌ చేతుల మీదుగా మా సాంగ్‌ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. తాజాగా విడుదలైన ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది.1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు