“పుష్ప”కు జాగ్రత్తలు మిస్సవుతున్న సుకుమార్..ఇది మరోసారి!

“పుష్ప”కు జాగ్రత్తలు మిస్సవుతున్న సుకుమార్..ఇది మరోసారి!

Published on Dec 18, 2020 7:01 AM IST

Allu sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్ట మొదటిగా టేకప్ చేసిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “పుష్ప”. తన పాన్ ఇండియన్ ఎంట్రీ అదిరిపోయే రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్న బన్నీ ఈ సినిమా కు మాత్రం అనేక అడ్డంకులు ఎదుర్కోక తప్పడం లేదు. తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ మొదలైన కొద్ది కాలంలోనే ఎన్నో లీకులు బయటకు వచ్చేసాయి.

ఒక్క ఫొటోలే కాకుండా ఆన్ లొకేషన్ వీడియోస్ కూడా బయటకు వచ్చేయడం ఆశ్చర్యకరం. అలా లేటెస్ట్ గా మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన సినిమాల్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడే దర్శకుడు సుకుమార్. మరి ఈ సినిమాకు ఇంత సింపుల్ గా అందులోను పాన్ ఇండియన్ లెవల్లో ప్లాన్ చేస్తున్న ఈ భారీ చిత్రానికి ఇంత సింపుల్ గా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం కాస్త ఆశ్చర్యకర విషయమే అని చెప్పాలి.

వాటని కొందరు బన్నీ అభిమానులు కూడా జోరుగా షేర్లు చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా విషయంలో దర్శకుడు మరియు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ఇక ముందు అయినా ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు