సుకుమార్ నెక్స్ట్ సినిమా అతనితోనేనా ?

సుకుమార్ నెక్స్ట్ సినిమా అతనితోనేనా ?

Published on Apr 4, 2018 5:00 PM IST

రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ చెయ్యబోయే సినిమాలో అఖిల్ నటించవచ్చని సమాచారం. ఇదివరుకే అఖిల్, సుకుమార్ మద్య కథ చర్చలు జరిగినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.

అఖిల్ ప్రస్తుతం వెంకి అట్లూరి సినిమా చెయ్యబోతున్నాడు. లవ్ స్టోరి గా తెరకేక్కబోయే ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమా తో పాటు సుకుమార్ సినిమా ఒకేసారి తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి పూర్తి క్లారిటి రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు