స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా అంటే.. ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అలాగే పుష్ప సినిమా పై భారీ అంచనాలను ఉన్నాయి. కాగా త్వరలోనే గోదావరి ప్రాంతంలో పుష్ప సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందనేది ఇప్పటికే దాదాపు ఖాయం అయింది. తాజా అప్ డేట్ ఏమిటంటే, చిత్రబృందం ఒక ప్రసిద్ధ రిసార్ట్ ను బుక్ చేసుకుంది. మొదటి షెడ్యూల్ ముగిసే వరకు టీమ్ మొత్తం అక్కడే ఉంటుంది. స్టార్ తారాగణంతో సహా మొత్తం సిబ్బంది ఈ రిసార్ట్ లోనే ఉండాలని సుకుమార్ టీమ్ కి స్పష్టం చేశాడు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రావడానికి గానీ, లేదా బయటకు వెళ్లడానికి గానీ అనుమతించరట.
ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో స్మగ్లింగ్ సీన్స్ అన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ గా ఉంటాయని.. హాలీవుడ్ స్టంట్స్ రేంజ్ లో ఈ ఫైట్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ వెంకట్ డిజైన్ చేస్తున్నారని.. సినిమా మొత్తంలో ఈ సీక్వెన్స్ నే హైలైట్ అవ్వనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాను తీసుకున్నారు. అలాగే తమిళ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.


