25 లక్షలతో ఆక్సిజన్ అందిస్తున్న సుకుమార్.!

Published on May 20, 2021 3:08 pm IST

ప్రస్తుతం కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల రీత్యా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సినీ తారలు కూడా తమ వంతు సాయం అందిస్తూ వస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఇపుడు మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కూడా చేరారు. అయితే సుకుమార్ తన సొంత డబ్బులు 25 లక్షలతో కోనసీమ ప్రాంతంలో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు సహా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమకూర్చడం స్టార్ట్ చేశారట.

తన స్నేహితుల సాయంతో మొదటగా నాలుగు ఆక్సిజన్ సిలెండర్స్ ను వితరణ చెయ్యగా ఇంకో నాలుగైదు రోజుల్లో మొత్తం అంతా సప్లై జరగనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ విపత్కర సమయంలో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ సమయంలో తానే స్వయంగా ఇలాంటి పనులు అన్నీ చూసుకోవడం నిజంగా హర్షణీయం అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :