పూర్తయిన సుకుమార్ ‘కుమారి 21F’ షూటింగ్

పూర్తయిన సుకుమార్ ‘కుమారి 21F’ షూటింగ్

Published on May 15, 2015 5:39 PM IST

kumari
సుకుమార్ రచనలు విభాగంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పిస్తున్న ‘కుమారి 21F’ సినిమా కొన్ని నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. సుకుమార్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఉయ్యాల జంపాల హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కొత్త భామ షీనా బజాజ్ హీరోయిన్. ఈ సినిమాకు ‘కరెంట్’ చిత్రాన్ని తెరకెక్కించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదలచేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రత్నవేల్ సినిమాటోగ్రాఫర్ .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు