ఒకప్పటి హీరో, ప్రస్తుత విలక్షణ నటుడు సుమన్ తన 36 ఏళ్ళ కెరీర్ లో సౌత్ ఇండియన్ లోని అన్ని భాషల్లోనూ కలిపి సుమారు 400కి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకూ సౌత్ ఇండియాలోనే తన నటనా చాతుర్యాన్ని చూపించిన సుమన్ బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్నాడు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గబ్బర్’ సినిమాలో సుమన్ విలన్ గా కనిపించనున్నాడు.
సుమన్ తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గురించి మాట్లాడుతూ ‘ ‘శివాజీ’ సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ తన ఎత్తుకి, పర్సనాలిటీకి నేనైతే బాగుంటానని అక్షయ్ చెప్పడంతో క్రిష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ పాత్రలో నేను బాగుంటానని ‘గబ్బర్’ మూవీకి సెలక్ట్ చేసారని’ సుమన్ అన్నాడు. ఈ గబ్బర్ సినిమా తమిళంలో వచ్చిన ‘రమణ'(తెలుగులో ఠాగూర్) సినిమాకి రీమేక్.
ఇప్పటివరకూ సౌత్ ఇండియాలో నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొంది, ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకానున్న సుమన్ పుట్టిన రోజు ఈ రోజు.. ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున సుమన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


