సీనియర్ హీరో సుమంత్ నటించిన రెండు చిత్రాలు ఈ నెలలోనే విడుదలయ్యాయి. అందులో మొదటగా ‘సుబ్రహ్మణ్యపురం’ కొద్దీ రోజుల క్రితం విడుదలై పర్వాలేదనిపించింది. లో బడ్జెట్ సినిమా కావడంతో వచ్చిన కల్లెక్షన్స్ తో సినిమా సేఫ్ అయ్యింది.
ఇక ఈ చిత్రం తరువాత రెండు రోజులకిందట సుమంత్ నటించిన మరో చిత్రం ‘ఇదం జగత్’ విడుదలై యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే సినిమా కలెక్షన్స్ ను చూసి సుమంత్ షాక్ అయ్యాడట. దాంతో ఈచిత్ర నిర్మాతకు ఒక లేఖను రాశాడట. నేను ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఏ చిత్రానికి కూడా ఇంత తక్కువగా కలెక్షన్స్ రాలేదని దీనికి కారణం సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే సినిమా మీద ఆసక్తి లేనప్పుడు ఎందుకు సినిమా తీశారని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే సుమంత్ అన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. చాలా మందికి ఈ సినిమా విడుదలైన విషయం కూడా తెలియదు. దాంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతుంది ఈ చిత్రం.


