అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సుమంత్. మొదట్లో వరుసగా సినిమాలు చేసిన సుమంత్ ఈ మధ్య సినిమాలు చేయడం బాగా తగ్గించేసారు. సుమంత్ హీరోగా ఈ సంవత్సరం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ కూడా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ తీసుకున్న సుమంత్ తాజాగా మరో కొత్త సినిమాకి సైన్ చేసాడు.
సుమంత్ ఎస్ఎస్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ నాయుడు ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.
ఇది కాకుండా సుమంత్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిందగీ నా మిలేగా దోబర’ రీమేక్ లో కూడా నటించనున్నాడు. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.


