షూట్ పూర్తి చేసుకున్న “అనగనగా ఒక రౌడీ”.!

Published on May 1, 2021 4:20 pm IST

టాలెంటెడ్ హీరో సుమంత్ ఒకప్పుడు తన సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గ్యాప్ వచ్చి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నా మళ్ళీ “సుబ్రహ్మణ్యపురం” సినిమాతో బ్రేక్ వచ్చి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మను యజ్ఞ దర్శకత్వంలో సుమంత్ ఒక మాస్ డ్రామాలో నటిస్తున్నాడు. అదే “అనగనగా ఒక రౌడీ”.

విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ వాల్తేర్ వాసు గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం షూట్ అంతా కంప్లీట్ అయ్యినట్టు సుమంత్ కన్ఫర్మ్ చేసాడు. అలాగే ఇక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసుకున్నట్టుగా తెలిపాడు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వినీత్ భట్ మరియు గార్లపాటి రమేష్ లు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :