
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో చూపిస్తూ బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా ‘సరైనోడు'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ టోటల్ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం సరైనోడు రిలీజ్ కోసం ఆల్లు అర్జున్, బోయపాటి శ్రీనుకి బాగా కలిసి వచ్చిన నెలని రిలీజ్ కోసం చూస్తున్నారు. బోయపాటి శ్రీను కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సింహా, లెజెండ్ సినిమాలు సమ్మర్ సీజన్ మొదట్లో అనగా మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
అలాగే అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రేసుగుర్రం సినిమా కూడా సమ్మర్ మొదట్లో రిలీజ్ అయ్యింది. దాంతో ప్రస్తుతం ఈ చిత్ర టీం సమ్మర్ ఫస్ట్ రిలీజ్ గా ఏప్రిల్ ఫస్ట్ వీక్ ని టార్గెట్ చేసారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చెబుతున్న దాని ప్రకారం మార్చి కల్లా అన్ని వర్క్స్ అయిపోతాయి కానీ అది రిలీజ్ కి రైట్ టైం కాదు, అందుకే అందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసాక ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్ గా అన్నీ చూసుకొని ఈ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు.
అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేస హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

