బెడిసికొట్టిన ప్రమోషన్లు.. సారీ చెప్పిన హీరో

Published on Jul 10, 2019 2:12 am IST

సందీప్ కిషన్ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం ఈ నెల 12న విడుడలకానుంది. దీంతో ప్రమోషన్లు చేయాలని నిర్ణయించుకున్న సందీప్ కిషన్ తన స్నేహితుడు, నటుడు ప్రియదర్శి సహాయాన్ని తీసుకున్నాడు. క్రేజీగా ఉండాలని సినిమాలో హీరో వాడిన బైకును తనదిగా చెప్పుకుని, అది చోరీకి గురైందని ఒక సీసీ టీవీ వీడియోను రూపొందించి ట్విట్టర్లో పెట్టారు. దీంతో నెటిజన్లు బాగా రియాక్ట్ అయ్యారు. వారితో పాటు పోలీసులు కూడా స్పందించారు.

చోరీ జరిగిన లొకేషన్ చెప్పమని ప్రియదర్శిని అడిగారు. దీంతో ప్రియదర్శి వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేశారు. సందీప్ కిషన్ స్పందిస్తూ అనుకున్నదానికంటే వ్యవహారం మరింత సీరియస్ అయింది అంటూ ఇది సినిమా ప్రమోషన్లలో భాగమని, అది ప్రియదర్శి బైక్ అని, దాన్ని సినిమాలో వాడటం జరిగిందని, అందుకే ఈ తరహా ప్రమోషన్స్ చేశామని అంటూ సారీ చెప్పారు.

సంబంధిత సమాచారం :

X
More