టాలెంటెడ్ దర్శకుడుతో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on May 7, 2021 10:10 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మళ్ళీ తనధైన సబ్జెక్టులు ఎంచుకుంటూ ట్రాక్ లోకి వచ్చాడు. రీసెంట్ గా ఏ 1 ఎక్స్ ప్రెస్ తో అలరించిన సందీప్ ఇప్పుడు తన 28వ సినిమాగా మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో సన్నద్ధం అవుతున్నాడు. తెలుగులో తనదైన ఆసక్తికర కాన్సెప్ట్ సినిమాలతో మంచి బెంచ్ మార్క్ సెట్ చేసిన దర్శకుడు వి ఐ ఆనంద్ తో మళ్ళీ ఆరేళ్ళ తర్వాత సినిమా చెయ్యడం కన్ఫర్మ్ అయ్యింది.

“టైగర్” చిత్రంతో మొదలైన ఈ కాంబో నుంచి ఇప్పుడు ఒక సూపర్ నాచురల్ కాన్సెప్ట్ పై సబ్జెక్ట్ ఇపుడు అనౌన్స్ అయ్యింది. ఇప్పటికే “ఎక్కడికి పోతావు చిన్నవాడ”, “క్షణ క్షణం” సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు నుంచి ఇది మరో గుడ్ అటెంప్ట్ లా ఉందని చెప్పాలి. అలాగే ఈ కాన్సెప్ట్ పై డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా మంచి ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ చిత్రానికి రాజేష్ దందా నిర్మాణం వహిస్తుండగా పరిస్థితులు సెట్ అయ్యాక రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :