సందీప్‌కిషన్ ‘123’కి హీరోయిన్ దొరికింది!

సందీప్‌కిషన్ ‘123’కి హీరోయిన్ దొరికింది!

Published on Dec 5, 2015 6:31 PM IST

Sundeep_Kishan
వైవిధ్యభరితమైన కథాంశాలతో తెలుగు యువహీరోల్లో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న సందీప్ కిషన్, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో తాజాగా ఓ తమిళ హిట్ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. తమిళ, మళయాలంలో బంపర్ హిట్ కొట్టిన ‘నేరమ్’ అనే సినిమాను సందీప్ కిషన్ తెలుగులో ‘123’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు.

నివిల్ పాల్, నజ్రియాలకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాను తెలుగులో సుందర్ చెరుకూరి నిర్మాతగా రీమేక్ చేస్తుండగా, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళుతోన్న నేపథ్యంలోనే, తాజాగా సినిమా టీమ్ హీరోయిన్‌ను కూడా కన్‌ఫర్మ్ చేసేసింది. పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని చివరి నిమిషంలో కోల్పోయిన అనీషా ఆంబ్రోస్ తాజాగా సందీప్ కిషన్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు