అలా చేసిన తొలి 1000 మందికి సందీప్ కిషన్ బంపర్ ఆఫర్..!

Published on Aug 19, 2021 11:44 pm IST

కమెడియన్ సత్య హీరోగా దర్శకుడు రామ్‌ అబ్బరాజు తెరెక్కించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ అతిధి పాత్రలో నటించారు. కె.ఎస్‌. శినీష్‌తో కలిసి సందీప్‌ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 27న సోని లివ్‌ ఓటీటీ వేదికగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో తెలుగు ప్రేక్షకులకు సందీప్‌ కిషన్ ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు.

అయితే “వివాహ భోజనంబు” సినిమా రెండు గంటలపాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమని, ఈ చిత్రంతో కొంతమంది కొత్త వారిని పరిచయం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని సందీప్ చెప్పుకొచ్చాడు. తనను ఆదరించిన ప్రేక్షకులతో ఈ సినిమా విడుదల సంబరాన్ని జరుపుకోవాలని ఉందని అన్నారు. అయితే మా ఈ సినిమా రిలీజ్‌ పోస్టర్‌తో మీ ఫ్యామిలీ ఫోటో జతచేసి షేర్‌ చేయాలని, అలా పోస్ట్‌ చేసిన తొలి 1000 మందికి తన నుంచి సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తానని ప్రకటించాడు.

సంబంధిత సమాచారం :