షూటింగ్ ముగించేసిన సందీప్ కిషన్ !

ఎన్నో ఆశలతో చేసిన ‘నక్షత్రం’ పరాజయంతో డీలా పడిన యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలోనే ‘కేరాఫ్ సూర్య’ తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై కాస్తంత పాజిటివ్ బజ్ నెలకొంది. ‘నా పేరు శివ’ ఫేమ్ సుశీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈరోజే ముగిసింది.

ఈ చిత్రాన్ని నవంబర్ రెండవ వారంలో రిలీజ్ చేసే అవాకాశాలున్నాయి. సినిమా టీజర్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి బాగా కనెక్టయిందని, సినిమా కూడా నచ్చుతుందని సందీప్ కిషన్ అన్నారు. ‘స్వామి రారా’ నిర్మాత చక్రి చిగురుపాటి తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఒకేరోజు రిలీజ్ కానుంది.