లాక్ డౌన్ ప్రభావంతో పూర్తైన చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పటికీ విడుదల కుదరకపోవడం, సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకపోవడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారు. చాలా సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. అలా ఓటీటీలోకి వెళ్తున్న సినిమాల్లో హీరో సందీప్ కిషన్ నటించిన రెండు చిత్రాలు కూడ ఉన్నాయి.
సందీప్ కిషన్ చాన్నాళ్ళ క్రితం తమిళంలో ‘నరగసూరన్’ అనే సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రానికి కార్తిక్ నరేన్ దర్శకుడు. అనేక అడ్డంకుల తర్వాత ఇటీవలే సినిమా కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ సమయానికి సినిమా హాళ్ళు మూతబడ్డాయి. దీంతో నిర్మాతలు సోనీ లైవ్ ఓటీటీ ద్వారా జూన్ నెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే సందీప్ కిషన్ చేసిన తమిళ ఆంథాలజీ ‘కసడ తపర’ కూడ సోనీ లైవ్ ఓటీటీ ద్వారానే జూన్ నెలలోనే విడుదలకానుంది. ఈ ఆంథాలజీని చింబు దేవన్ డైరెక్ట్ చేశారు.


