‘స్పైడర్’ తో పాటే సందీప్ కిషన్ సినిమా ట్రైలర్ !


యంగ్ హీరో సుందీప్ కిషన్ ప్రస్తుతం సుమారు మూడు వరకు కొత్త సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మహేష్ బాబు సోదరి మంజుల తొలిసారి, మెగా ఫోన్ పడుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఒకటి. మే నెలలో ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం కేరళ అప్రైసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది.

ఇకపోతే ఈ సినిమా యొక్క ట్రైలర్ ను సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న మహేష్ బాబు ‘స్పైడర్’ తో పాటే థియేటర్లలో ప్రదర్శిస్తారని టాక్. ఒకవేళ ఇదే గనుక జరిగితే సందీప్ కిషన్ సినిమాకి బోలెడంత పబ్లిసిటీ రావడం ఖాయం. ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్, మంజులలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిదా చౌదరి, అమైరా దస్తూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.