హిందీ ‘ఆర్ ఎక్స్ 100’ లో నటించబోతున్న ప్రముఖ హీరో కుమారుడు !

Published on Sep 25, 2018 9:22 am IST

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం తెలుగులో ఎంతటి సంచలనాత్మక విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ త్వరలోనే హిందీలో కూడా రీమేక్ చేయబోతుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారు. అయితే ఈ బాలీవుడ్ రీమేక్ లో నటించబోయే హీరో గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి ఈ ‘ఆర్ ఎక్స్ 100’ రీమేక్ తో.. హిందీలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆహాన్ కు ఇప్పుడు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. మరి ఈ వైల్డ్ లవ్ స్టోరీలో ఎలా నటిస్తాడో చూడాలి. కాగా ఈ చిత్రం తమిళంలో కూడా రీమేక్ కానుంది. తమిళంలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి ఈ చిత్రానికి సరైన డైరెక్టర్ కోసం వెతికే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :