హిందీ రీమేక్ లో అంధుడిగా సునీల్…?

Published on Jun 12, 2019 11:30 pm IST

ఒకప్పుడు స్టార్ కమెడియన్ అయిన సునీల్ దాదాపు అన్నిసినిమాలలో కనిపించేవారు. హీరోగా మారాక, కామెడీ పాత్రలకు టాటా చెప్పేశారు.హీరో సునీల్ ప్రస్తుతం పూర్తి స్థాయి కమెడియన్ గా సినిమాల్లో ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే మళ్ళీ ఓ ప్రయోగాత్మక మూవీ తో సునీల్ హీరో గా తన అదృష్టాన్ని ప్రరీక్షించుకోనున్నాడని సమాచారం.

హిందీలో గత సంవత్సరం విడుదలై పెద్ద విజయం సాధించిన “అంధాదున్” తెలుగు అనువాదంలో సునీల్ హీరో గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. టబు, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా నటించిన ఈ హిందీ మూవీలో హీరో ఆయుష్మాన్ ఖురాన్ అంధుడిగా నటించారు. ఐతే సునిల్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసి ఎంతవరకు మెప్పిస్తాడనేది చూడాలి. ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేని ఈ మూవీ ఇంకా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తమిళ రీమేక్‌లో నటించేందుకు ధనుష్‌ , సిద్ధార్థ్‌ లు ఆసక్తి చూపిస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More