‘చిరంజీవి’ 150వ సినిమాలో ‘సునీల్’ కన్ఫర్మ్

‘చిరంజీవి’ 150వ సినిమాలో ‘సునీల్’ కన్ఫర్మ్

Published on Jul 30, 2016 8:38 PM IST

chiru-and-sunil
‘మెగాస్టార్ చిరంజీవి’ చేస్తున్న 150 వ చిత్రంలో పలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ‘కాజల్ అగర్వాల్’ హీరోయిన్ అని వార్తలు వస్తున్న సందర్భంలో మరో నటుడు ఈ సినిమాలో చిరంజీవితో కలిసి నటించనున్నాడని తెలిసింది. అతనే చిరంజీవికి వీరాభిమాని ‘సునీల్’. చిరు ఇన్నేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తుండంతో ఆ సినిమాలో ఓ పాత్ర చెయ్యాలని ఉందని తానే స్వయంగా అడిగినట్టు సునీల్ తెలిపాడు.

ఆయన అడిగినట్టే తనకు ఓ పాత్ర దక్కిందని, తనకు సంబందించిన షూటింగ్ ఆగష్టులో జరుగుతుందని కూడా తెలిపాడు. సునీల్ చిరు పక్కన నటించడం కొత్తేమి కాదు. గతంలో ల్ కూడా స్టాలిన్, అందరివాడు వంటి సినిమాల్లో చిరు పక్కన ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్రల్లో కనిపించాడు సునీల్. కానీ హీరోగా మారాక అలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు