యాక్షన్ హీరో సినిమాలో సునీల్ కీ రోల్

Published on Jun 18, 2019 6:36 pm IST

హీరోగా మెప్పించిన సునీల్ తిరిగి తన పాత కామెడీ ట్రాక్ ఎక్కారు. ‘అరవింద సమేత’లో సునీల్ స్నేహితుడిగా కనిపించి అలరించిన ఆయన ఇటీవల విడుదలైన ‘చిత్రలహరి’లో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల నుండి కూడా స్పందన వస్తుండటం, అందరూ సునీల్ పాత ట్రాక్ ఎక్కి రైట్ డెసిషన్ తీసుకున్నాడని అంటుండటంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు సునీల్.

ప్రస్తుతం ఆయన యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న ‘చాణక్య’ సినిమాలో ఒక కీ రోల్ చేస్తున్నారు. ఇది కూడా ఫుల్ లెంగ్త్ పాత్రని తెలుస్తోంది. సునీల్ గతంలో గోపీచంద్ చేసిన ‘ఆంధ్రుడు, ఒంటరి’ సినిమాలో మంచి ఎంటర్టైనింగ్ రోల్స్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇకపోతే అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ ప్రిజాద, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More